నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘జెర్సీ’. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించాడు. అతని అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ‘జెర్సీ’ తెలుగులో హిట్ అవ్వడంతో ఇప్పుడు బాలీవుడ్లో కూడా రీమేక్ చేస్తున్నారు.అక్కడ కూడా గౌతమ్ తిన్ననూరినే దర్శకుడు. ఇదిలా ఉండగా..
ఈ చిత్రంలో హీరో నాని పాత్ర కేవలం తన అభిమానులనే కాదు ప్రతీ ప్రేక్షకుడిని కూడా అలరిస్తుంది. అతను అత్యద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని కనిపించాడు. ఆ పాత్ర అంత అద్భుతంగా పండడానికి ప్రధాన కారణం అతని కొడుకు నాని పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ వలనే అని చెప్పాలి. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగానే ఉంటాయి. ఈ పాత్రని పోషించిన పిల్లాడు రోనిత్ కామ్రా.
ఇతనిది ఢిల్లీ.అయితే రోనిత్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన పిల్లాడు. ‘జెర్సీ’ సినిమాలో నటించక ముందు ఇతను ‘ఫ్యాబ్ ఇండియా’, ‘హార్లిక్స్’, ‘టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్’, ‘టప్పర్ వేర్’ వంటి యాడ్స్ లో యాక్ట్ చేసాడు. రోనిత్ తల్లి పేరు సోనియా కామ్రా. తండ్రి పేరు విపిన్ కామ్రా. ఇప్పుడు హిందీ ‘జెర్సీ’ లో కూడా ఇతనే కొడుకు పాత్రను పోషిస్తున్నాడు.