డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని. మాస్ హీరోయిజానికి సరికొత్త డెఫినిషన్ చెప్పిన దర్శకుడు ఇతను. ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రి నాథ్’ ‘సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్’ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ ఇలాంటి ఎన్నో దమ్మున్న డైలాగులు రాసిన దర్శకుడు. టాలీవుడ్ కు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ వంటివి ఇచ్చిన పూరి లెక్కలేనన్ని ప్లాపులు కూడా ఇచ్చాడు.
పూరి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు.. హీరో క్యారెక్టరైజేషనే కథ. అందుకే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి ఓవర్ నైట్లో స్టార్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు మాస్ ఇమేజ్ ను, స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది పూరి జగన్నాథ్ అనడంలో సందేహం లేదు. అలాంటి పూరి తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు.
సాయి రామ్ శంకర్ గొప్ప నటుడు. కానీ సరైన కథ పడకపోవడం వలన అతను త్వరగానే ఫేడౌట్ అయిపోయాడు. ఇదిలా ఉండగా.. పూరి జగన్నాథ్ కు మరో తమ్ముడు ఉన్నాడు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. అతనే ఉమా శంకర్ గణేష్. ఇతను పూరికి పెద్ద తమ్ముడు. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ప్రస్తుతం ఉమాశంకర్ గణేష్ వైసిపి తరపున నర్సీపట్నం నుండీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.మొదట్లో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు.
1995 నుండీ రాజకీయాల్లో ఉన్న ఉమా శంకర్ గణేష్, 2001 వరకు సర్పంచ్ గా, 2009 నుంచి 2012 వరకు తాండవ ఆయకట్టు సంఘానికి చైర్మన్ గా వ్యవహరించారు. 2014లో వైసిపి పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2019లో బంపర్ మెజారిటీతో గెలుపొందారు.తన తమ్ముడు ఎమ్మెల్యే అయినప్పటికీ పూరి ఈ విషయాన్ని ఎక్కువగా చెప్పుకోలేదు.