నిన్న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్ప్స్ యూట్యూబ్ లో చరిత్ర సృష్టిస్తోంది.కేవలం 45 సెకండ్లు మాత్రమే నిడివి ఉన్న ఈ గ్లిమ్ప్స్ లో విజువల్స్ తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ను ప్రెజెంట్ చేసాడు రాజమౌళి. అది అందరి దర్శకులకి సాధ్యమయ్యేది కాదు. అందుకే రాజమౌళి స్పెషల్ అని చెప్పాలి. 24 గంటలు గడవకుండానే యూట్యూబ్లో ఈ గ్లిమ్ప్స్ 7 మిళియన్లకు పైనే వ్యూస్ ను నమోదు చేసింది. రియల్ టైం కలుపుకుంటే దాని లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే.. 623K లైక్స్ నమోదయ్యాయి. టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ గ్లిమ్ప్స్ అద్బుతంగా అంటూ కొనియాడారు. ప్రతీ ప్రేక్షకుడు ఈ గ్లిమ్ప్స్ ను రిపీట్ గా చూస్తాడు. ఎందుకంటే ఇది అంత వేగంగా అదే విధంగా అద్భుతంగా ఉంది కాబట్టి. అయితే గ్లిమ్ప్స్ వేగంగా ఉండడంతో కొన్ని విషయాలు అందరూ గమనించి ఉండరు. అందులో 10 ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు చెప్పకుందాం రండి :
1) ఆరంభంలో వ్యక్తి వెనుక పులి పరిగెడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని అందరూ అనుకుంటున్నారు.ఎందుకంటే భీమ్ పాత్రని పరిచయం చేసినప్పుడు ఈ లొకేషన్ ను మనం చూసాం.
2) అటు తర్వాత షాట్ లో ఎన్టీఆర్ కంట నెత్తురు అలాగే చరణ్ కంట నిప్పు కనిపిస్తున్న విజువల్ ఉంది. నిజంగా ఈ షాట్ కు దర్శకుడికి దణ్ణం పెట్టేయొచ్చు. అంత అద్భుతంగా ఉంది.
3) ఆ వెంటనే అజయ్ దేవగన్ ఓ బ్రిటీష్ వ్యక్తిని తుపాకీతో కాలుస్తున్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కొమరం భీమ్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు కథనాలు వినిపించాయి. అది నిజమో కాదో తెలీదు కానీ శ్రీయ ఇతనికి జోడీగా నటిస్తుంది అని మాత్రం ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఆ రకంగా చూసుకుంటే ఎన్టీఆర్ కి తల్లిగా శ్రీయ కనిపించే అవకాశం ఉండదు కదా. అసలే ఎన్టీఆర్ కు జోడీగా శ్రీయ ‘నా అల్లుడు’ అనే సినిమాలో నటించింది.
4) ఆ తర్వాతి షాట్ లో హీరోయిన్లు ఒలీవియా మోరిస్, అలాగే అలియా భట్ లు కనిపించారు.ఎన్టీఆర్ సరసన ఒలీవియా, చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్నారు.
5)ఒక షాట్ లో అయితే రాహుల్ రామకృష్ణ, ఎన్టీఆర్ లు ఎమోషనల్ గా పరిగెత్తుకుని వస్తున్నారు.
6) ఇంకో షాట్ లో శ్రీయ ముగ్గురు పిల్లలను వెంట బెట్టుకుని కంగారుగా ఏడుస్తూ పరిగెడుతుంది.
7) ఎన్టీఆర్ ఆవేశంతో పరిగెడుతున్న షాట్ కూడా ఒకటి ఉంది. ఇందులో ఎన్టీఆర్ వంటి పై అండర్వేర్ తప్ప ఇంకేమి లేదు. బహుశా భీమ్ పులితో చేసే సీన్ కాబోలు.
8) ఓ బ్రిడ్జి పై జెండా పట్టుకుని ఓ వ్యక్తి నీళ్ళ లోకి దూకుతున్న షాట్ ఒకటి ఉంది. అతను చరణ్ అయ్యి ఉండొచ్చు. ఇంకో వైపు మరో వ్యక్తి దూకుతున్నాడు. అతను ఎన్టీఆర్ అయ్యి ఉండొచ్చు. చరణ్ దూకే వైపు గుర్రం, ఎన్టీఆర్ దూకే వైపు బైక్ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
9) చరణ్ పోలీస్ డ్రెస్ లో, బ్రిటీష్ డ్రెస్ లో అలాగే పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మరో డ్రెస్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు.
10) బండి పై ఒకరు, గుర్రం పై మరో ఒకరు కనిపిస్తున్న ఒక షాట్ ఉంది. గుర్రం పై ఉన్నది చరణ్, బైక్ పై ఉన్నది ఎన్టీఆర్ అయ్యి ఉండొచ్చు.
11) ఎన్టీఆర్ నీటితో మరోవైపు చరణ్ నిప్పుతో కనిపిస్తున్నారు. ఇది వీరిద్దరి మధ్య జరిగే ఫైట్ సీన్ అయ్యి ఉండొచ్చు అని అంచనా.
12) ఇక చివరాఖరికి ఓ బ్రిటీష్ వ్యక్తి పై పులి దూకుతూ కనిపిస్తుంది. ఇది కొమరం భీమ్ పెంపుడు పులి అయ్యి ఉండొచ్చు అనేది కొందరి అభిప్రాయం.