యాదమ్మ రాజు బుల్లితెర పై ఇతను సైలెంట్ గా స్టార్ అయిపోయాడు అన్న సంగతి తెలిసిందే. ‘పటాస్’ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఇతను అడపా దడపా కనిపించినా.. సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. పంచ్ డైలాగులను… అమాయకపు హావభావాలతో చెప్పి నవ్వించడం ఇతని స్టైల్. యాదమ్మ రాజు పలు సినిమాల్లో కూడా నటించాడు.బుల్లితెర సెలబ్రిటీలంతా.. సొంత యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ యాదమ్మ రాజు కూడా ఉన్నాడు.
తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేశాడు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు స్టెల్లా …! ఈ మధ్యనే ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇతని పెళ్లి వేడుకలో ‘జబర్దస్త్’ కమెడియన్లు, బిగ్ బాస్ సెలబ్రిటీలు, సినీ నటులు సందడి చేశారు. ‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్స్ అయిన సోహెల్, ముక్కు అవినాష్, హైపర్ ఆది వంటి వారు హాజరయ్యారు.
అలాగే ‘మాసూద’ హీరో తిరువీర్(గోపి) కూడా హాజరయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇక యాదమ్మ రాజు హిందూ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాగా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి స్టెల్లా ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.ఇదిలా ఉండగా.. యాదమ్మ రాజు పెళ్లికి సంబంధించిన కొన్ని అన్ సీన్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :