రామ్‌చరణ్ – ఉపాసనల వివాహమై సుమారు పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ వీరు తల్లిదండ్రులు కాలేదు. దీంతో వీరికి తరచుగా ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు? అని అంటుంటారు. దీనిపై ఉపాసన ఇటీవల ఓ బహిరంగ వేదిక మీద చర్చించారు. సద్గురును ఇంటర్వ్యూ చేసే సందర్భంలో ఉపాసన సంతానం ప్రస్తావనను తీసుకొచ్చారు. దానికి సద్గురు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ స్టేజ్ మీద ఏమైందంటే…
మాతృత్వంపై తన ప్రశ్నలను సద్గురు ముందు ఉంచారు ఉపాసన. RRR గురించి ఉపాసన అడిగారు. RRR అంటే.. రిలేషన్ ®, రీ ప్రొడ్యూస్, (R) రోల్ ఇన్ లైఫ్ (R) . వీటి గురించి జనాలు నన్ను ఎందుకు అడుగుతుంటారు అని ఉపాసన సద్గురును అడిగారు. దానికి సద్గురు తనదైన శైలిలో అద్భుతంగా సమాధానం ఇచ్చాడు. ‘‘మాకు పెళ్లై పదేళ్లు అవుతోంది. నా లైఫ్ నాకు ఎంతో నచ్చింది. కానీ జనాలు నా విషయంలో RRR గురించి అడుగుతుంటారు ఎందుకు?’’ అని ఉపాసన తన ప్రశ్నను సంధించారు.
‘‘పిల్లల్ని కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డు ఇస్తాను. జీవితంలో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ తరం వాళ్లు అలా ఉంటే నేను అవార్డు ఇస్తాను’’ అని చెప్పారు సద్గరు. ‘‘ఒకవేళ నువ్ ఆడపులివి అయి ఉంటే పిల్లల్ని కనమని చెప్పేవాణ్ని. ఎందుకంటే అవి పులులు అంతరించిపోతోన్నాయి. కానీ మన అంతరించడం లేదు కదా. ఇప్పటికే భూమ్మీద చాలా ఎక్కువ సంఖ్యలో మనుషులు ఉన్నారు’’ అని తన ఆలోచనను చెప్పారు సద్గురు.
దాంతోపాటు ‘‘పని ఉంటే పిల్లల్ని కనే ఆలోచనలుండవు. పని లేని వాళ్లందరికి ఆ హార్మోన్లు ఆగనివ్వవు. పిల్లల్ని కంటూ ఉంటారు. కాబట్టి పిల్లన్ని కనకుండా ఉండటమే మనం చేసే గొప్ప మేలు’’ అని సద్గురు సమాధానం ఇచ్చారు. సద్గురు సమాధానంతో ఉపాసన మట్లాడుతూ ‘‘మీరు ఇలా చెప్పారు కదా? మీకు వెంటనే మా అమ్మ, అత్తగారి నుండి ఫోన్లు వస్తాయి’’ అని అన్నారు. అయితే దానికి సద్గురు ‘‘అలాంటి అత్తలు, అమ్మల నుండి నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి’’ అని కౌంటర్ వేశారు.