Upasana: బేబీ బంప్ తో ఉపాసన… వైరల్ అవుతున్న ఫోటో!

మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుంది అన్న వార్త మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులను కూడా ఎంతో సంతోషానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని వార్త తెలియగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అయితే 10 సంవత్సరాల అనంతరం ఉపాసన తల్లి కాబోతుందని తెలియడంతో ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఈ వార్త తెలియగానే చాలామంది ఈమె నేరుగా పిల్లలకు జన్మనివ్వలేదని సరోగసి ద్వారా తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాసన ఇలా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వబోతున్నారని వార్తలు రావడంతో ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న ఈ వార్తలు పూర్తిగా ఆ వాస్తవం అంటూ తాజాగా ఉపాసన రాంచరణ్ కలిసి దిగిన ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. ఉపాసన రాంచరణ్ తన కజిన్ పెళ్లి కోసం థాయిలాండ్ వెళ్లారు.

అయితే అక్కడ తమ స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందులో ఉపాసన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతోంది. దీంతో ఈ ఫోటో ద్వారా ఉపాసన సరోగసి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. ప్రస్తుతం ఉపాసన ఈ బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఉపాసన తన జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో తాను మాతృత్వంలోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus