Dootha Web Series: ‘దూత’ రీషూట్ జరుగుతుందా..?

అక్కినేని నాగచైతన్య త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు చైతు. విక్రమ్ తో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నప్పుడే సమాంతరంగా ‘దూత’ అనే వెబ్ సిరీస్ ను మొదలెట్టారు. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ వెబ్ సిరీస్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

అమెజాన్ సంస్థ కంటెంట్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. కాస్త డౌట్ ఉన్నా.. రీషూట్స్, డిస్కషన్స్, రీ ఎడిటింగ్స్ కచ్చితంగా చేస్తారు. ప్రస్తుతం ‘దూత’ వెబ్ సిరీస్ విషయంలో కూడా అదే జరుగుతోందని సమాచారం. పైగా ఇప్పుడు చైతు కానీ దర్శకుడు విక్రమ్ కానీ మంచి ఫామ్ లో లేరు. ఇప్పుడు ఈ ‘దూత’ని రిలీజ్ చేయడం వలన పెద్దగా బజ్ రాదని అమెజాన్ సంస్థ భావిస్తోంది. చైతు నటించిన ఏదైనా సినిమా హిట్ అయినా..

లేదా మంచి బజ్ లో ఉన్నా ‘దూత’ సిరీస్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అమెజాన్ దగ్గర కంటెంట్ కి లోటు లేదు. అందుకే ‘దూత’ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో పెట్టారు. ఇంకా ఈ సిరీస్ రిలీజ్ కానప్పటికీ ‘దూత2’ స్క్రిప్ట్ రెడీ చేయమని విక్రమ్ కుమార్ ని అమెజాన్ సంస్థ కోరిందట. దాన్ని బట్టి సెకండ్ సీజన్ కూడా ఉందనే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం చైతు ‘కస్టడీ’ అనే సినిమాలో నటిస్తున్నారు.

వెంకట్ ప్రభు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని వదిలారు. ఇందులో చైతు ఫెరోషియస్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో చైతు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus