‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దీంతో ఆయన వరుసగా పాన్ ఇండియా కథలే ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో విడుదలైన ‘సాహో’ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన సినిమాలకు బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘రాధేశ్యామ్’కి కూడా ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను రూ.400 కోట్లకు హోల్ సేల్ గా కొనడానికి ప్రముఖ ఓటీటీ సంస్థ ముందుకొచ్చింది.
కానీ ‘రాధేశ్యామ్’ మేకర్స్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను విడివిడిగా అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ మొత్తానికి అమ్మేసినట్లు సమాచారం. హిందీ డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని జీ5 స్ట్రీమ్ చేయనుందట.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను సైతం జీ గ్రూప్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే వీటికి ఎంత రేటు పలికిందనేది బయటకు చెప్పడం లేదు. కనీసం ఎంత లేదన్నా.. రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!