Khushi: పుకార్లకు చెక్ పెట్టిన ‘ఖుషి’ డైరెక్టర్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం ఎలా ఉంది..? ఆమె తిరిగి షూటింగ్స్ కి ఎప్పుడొస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రీసెంట్ గా ఆమె ఓ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హిందీ సిరీస్ ‘సిటాడెల్’ అనే ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టారు సమంత. అందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత మరో ప్రశ్న మొదలైంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు సరే.. మరి సమంత పూర్తి చేయాల్సిన తెలుగు సినిమా ‘ఖుషి’ పరిస్థితి ఏంటి..?

శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ‘ఖుషి’ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ను కాశ్మీర్ లో నిర్వహించారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఆ తరువాత సమంత అనారోగ్యం బారిన పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా వేశారు. అప్పటినుంచి సమంత తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా..? అని ఎదురుచూస్తున్నాయి యూనిట్ వర్గాలు. సమంత వస్తే షూటింగ్ మొదలుపెట్టడానికి విజయ్ దేవరకొండతో పాటు యూనిట్ మొత్తం సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో ఓ పుకారు వచ్చింది. అదేంటంటే.. మార్చి తొలి వారానికి కూడా సమంత ‘ఖుషి’ సెట్స్ పైకి రాకపోతే మరో సినిమా చేయాలని శివ నిర్వాణ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆయన ఖండించారు. ‘త్వరలోనే ఖుషి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ప్రతిదీ అందంగా ఉండబోతుంది’ అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పద్నది.

నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనుకున్నట్లుగా షూటింగ్ పూర్తి కాలేదు. సమంతతో పాటు విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’ షూటింగ్ లో గాయాలు కావడంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తరువాత ఫిబ్రవరిలో రిలీజ్ అనుకున్నారు. ఇప్పుడు వేసవిలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus