ఉర్ఫీ జావేద్ హిందీ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యింది. అందులో విన్నర్ కాలేదు కానీ.. టాస్కుల్లో ఈమె తీరుకి కొంతమంది నెటిజన్లు చేసిన ట్రోలింగ్ వల్ల ఎక్కువ వార్తల్లో నిలిచింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా కాంట్రోవర్సీల్లో నిలిచింది ఉర్ఫీ. ముఖ్యంగా ఈమె ధరించే చిత్ర విచిత్రమైన డ్రెస్సులపై ఎక్కువగా విమర్శలు కురిసేవి.
ఫ్యాషన్ పేరుతో ఈమె అశ్లీలతను ఎక్కువగా ప్రోత్సహిస్తుందని, యువతని తప్పుదోవ పట్టిస్తోందని చాలా మంది ఈమెను తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు. స్వతహాగా ఈమె మోడల్ అయినప్పటికీ.. ఎందుకో విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని పబ్లిక్ లోకి వచ్చేది.. అక్కడ విమర్శల పాలయ్యేది. ఇప్పటికీ ఆమెపై అలాంటి ముద్రే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపి పెద్ద షాకిచ్చింది.
ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అతను దాదాపు 6 అడుగుల 4 అంగుళాలు ఎత్తు ఉంటాడు. ఢిల్లీకి చెందిన అతను నా లైఫ్ లాంగ్ తోడుంటానని మాటిచ్చాడు. అతనికే నా మనసు ఇచ్చేశాను. వాస్తవానికి అతనికి బాగా సిగ్గు. కనీసం సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేయడు. అతని ఫోటో కూడా నా దగ్గర లేదు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రతి వీకెండ్ మేము కలుస్తాము. మేము అనుకోకుండా ఒకసారి కలిశాము. ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్న.. అతని పెళ్లి గురించి కొంతమంది పెద్దలతో మాట్లాడుతున్నారు.కానీ మమ్మల్ని చూడగానే వాళ్ళతో పాటు ఆ పెద్దలు కూడా షాకయ్యారు. అలా అతని పెళ్లి చెడిపోవడానికి కారణం నేనయ్యాను. అయితే త్వరలోనే మేము ఒక్కటి కాబోతున్నాం” అంటూ చెప్పుకొచ్చింది.