పవన్ కల్యాణ్ మేనరిజం ఏంటి? అనగానే ఠక్కున కుడి చేయి ఎడమవైపు మెడ దగ్గరకు వెళ్లిపోతుంది ఫ్యాన్స్‌కి. పవన్ కల్యాణ్ స్టామినా గురించి చెప్పండి అంటే.. ‘కంటెంట్ ఉన్నోడికి..’ అంటూ డైలాగ్ నోటి చివర ఉన్నట్లు బయటకు వచ్చేస్తుంది. అంతగా ఈ రెండు విషయాలు పవన్‌కు ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. అయితే రెండో డైలాగ్‌ని ఇంప్రూవైజ్ చేసి.. కొత్త డైలాగ్‌ను క్రియేట్ చేశారు ఫ్యాన్స్. బుధవారం రాత్రి నుండి సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకుడిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సర్దార్ భగత్ సింగ్’గా మొదలైన ఈ సినిమా నాటకీయ పరిణామాల నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మారిపోయింది. డిసెంబరులో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. కళా దర్శకుడు ఆనంద్ సాయి రూపొందించిన ప్రత్యేకమైన పోలీసు స్టేషన్ సెట్‌లో సినిమా తొలి షెడ్యూల్ మొదలైంది. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది.
సినిమా షూటింగ్ మొదలైన విషయాన్ని తెలియజేస్తూ.. సినిమా టీమ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో పవన్ కల్యాణ్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ప్రీ లుక్ రిలీజ్ చేశారు అన్నమాట. పోలీసు స్టేషన్‌లో ఓ కుర్చీలో పవన్ కల్యాణ్ కూర్చుని.. చేతిలో టీ గ్లాస్ పట్టుకుని ఉన్నాడు. గుర్తుంచుకోండి టీ గ్లాస్. దీని గురించి ఆఖరున మాట్లాడదాం. ఆ లుక్‌ను పోస్టర్‌గా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ వైరల్‌గా మారడంతో.. కంటెంట్ ఉన్నవాడికి ఫ్రంట్ లుక్ అవసరం లేదు..
బ్యాక్ షాట్ లుక్ ఉన్న చాలు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ముందు చెప్పిన టీ గ్లాస్ గుర్తుంది కదా. ఈ గ్లాస్‌కు పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌కు ఉన్న సంబంధం తెలిసిందే. పార్టీ గుర్తు అది కాకపోయినా.. దానినే సింబల్‌గా వాడుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్‌లో ఆ గ్లాస్‌ను పెట్టారు. ఇదేదో అనుకోకుండా పెట్టారు అనుకోవడానికి వీల్లేదు. దీని పై చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.