దర్శకుడు వి.ఎన్. ఆదిత్య అందరికీ గుర్తుండే ఉంటాడు. గతంలో ‘మనసంతా నువ్వే’ ‘నేనున్నాను’ ‘ఆట’ వంటి చిత్రాలను తెరకెక్కించి సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక ఈయన దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక విడ్డూరం ఏంటంటే.. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ కు వినాయకుడు ద్వారా స్వాగతం పలికిస్తారట.
అదెలా అంటే.. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బాబి’ చిత్రంలో… రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో రిషికపూర్ , హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి వెళ్ళగానే… ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి ఈ సంఘటన.. రాజ్ కపూర్ జీవితంలో జరిగిందట. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలాగే కలుసుకున్నారని పలు సందర్భాల్లో వెల్లడించారు. తన సినిమాలో ఆ సీన్ ను చూపించాలని ఎంతో ప్రయత్నించినా వర్కౌట్ కాలేదట. ఆ టైములో ‘బాబి’ చిత్రంతో ఆ కోరిక తీర్చుకున్నాడని తెలుస్తుంది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కు తొలి సన్నివేశం కూడా అదేనట. ఈ సన్నివేశం దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు చాలా ఇష్టమైన సన్నివేశమట. ఇప్పటి వరకూ తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఈ సీన్ పెట్టాలి అను అనుకున్నప్పటికీ కుదర్లేదట. అందుకే ఇప్పుడు ‘వాళ్ళిద్దరి మధ్య’ సినిమాలో ఆ సీన్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పై దర్శకుడు వి.ఎన్. ఆదిత్యను మాట్లాడుతూ…” ‘బాబిలోని సన్నివేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది . ఒక రియల్ లైఫ్ లో అంకురించిన ప్రేమ , ఒక బ్లాక్ బస్టర్ సినిమా లవ్స్టోరీ కి ఒక షాట్ అయ్యింది. డింపుల్ కపాడియాపైన షూటింగ్ చేసిన మొదటి షాట్ కూడా అదే. ఆ దృశ్యం చిన్నప్పటినుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని తెర పై చూపించే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది. అయితే ఆ కథ వేరు… ఈ కథ వేరు. అందులో సున్నిపిండి ఉంది.. ఇందులో లేదు.. అంతే తేడా …! తెలుగుసినిమా పరిశ్రమలోకి హీరోయిన్ నేహాకృష్ణ ప్రవేశాన్ని విఘ్నేశ్వరుడి తలుపు ద్వారా స్వా గతించాలనే ఉద్దెశంతో కూడా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించాము. సాధారణంగా ప్రతీ పనికి వినాయకుడుని పూజించి మొదలు పెడతారు మన తెలుగు ప్రజలు. ఇప్పుడు వినాయకుడితో హీరోయిన్ ను ఇంట్రొడ్యూస్ చేస్తే… కచ్చితంగా సక్సెస్ దక్కుతుందనే నమ్మకం కావచ్చు.