Varalaxmi Sarathkumar: నా పేరులో భార్య పేరును చేర్చుకుంటా.. వరలక్ష్మి భర్త కామెంట్స్ వైరల్!
- July 16, 2024 / 12:27 PM ISTByFilmy Focus
వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో పాపులారిటీని పెంచుకున్నారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన హనుమాన్ సినిమాలో వరలక్ష్మి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నెల 10వ తేదీన వరలక్ష్మి, నికోలాయ్ సచ్ దేవ్ వివాహం థాయిలాండ్ లో సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి తర్వాత నికోలాయ్ సచ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ భార్య వరలక్ష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను కూడా తమిళం నేర్చుకుంటున్నానని నికోలాయ్ అన్నారు. నాకు తమిళంలో పొంతటి అనే పదం మాత్రమే తెలుసని ఆయన తెలిపారు. పొంతటి అంటే తెలుగులో భార్య అనే అర్థం వస్తుంది. ఇంతకాలం ముంబైకే పరిమితమైన నికోలాయ్ ముంబై నా ఇల్లు కాదని చెన్నై నా ఇల్లు అని చెప్పుకొచ్చారు. నా పేరు నికోలాయ్ సచ్ దేవ్ అని నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లి జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి పేరు వరలక్ష్మి శరత్ కుమార్ అని కొనసాగుతుందని నా పేరును మాత్రం ” నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్ దేవ్” గా మార్చుకుంటున్నానని నికోలాయ్ చెప్పుకొచ్చారు. శరత్ కుమార్, వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నాకు కూడా సొంతమని ఆయన అభిప్రాయపడ్దారు. వరలక్ష్మి నన్ను మ్యారేజ్ చేసుకున్నా ఆమె ఫస్ట్ లవ్ మాత్రం నేను కాదని ఆమె ఫస్ట్ లవ్ ఎల్లప్పుడూ సినిమాల్లో నటించడమే అని ఆయన చెప్పుకొచ్చారు.

పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి నటిగా కెరీర్ ను కొనసాగిస్తుందని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని నికోలాయ్ సచ్ దేవ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరి అభిమానుల ప్రేమ, మద్దతు ఆమెకు అవసరం అని నికోలాయ్ సచ్ దేవ్ అన్నారు. వరలక్ష్మి మాట్లాడుతూ నికోలాయ్ చెప్పినట్టు సినిమా నా జీవితం అని పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని వెల్లడించారు.












