Varun Tej: అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు: వరుణ్‌ తేజ్‌ క్లారిటీ!

వరుణ్‌తేజ్‌ సినిమాల్లో మాంచి యాక్షన్‌, ప్రయోగం, మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా అంటే ‘గద్దలకొండ గణేశ్‌’ అని చెప్పాలి. హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించిన సినిమా ఇది. అలాగే వరుణ్‌తేజ్‌ పక్కన పక్కాగా సూట్‌ అయిన హీరోయిన్ల సాయిపల్లవి ఒకరు అని చెప్పొచ్చు. దీంతో ఈ రెండు రకాల కాంబినేషన్లు మళ్లీ రావాలి అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే… మీకు గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ల గురించి వరుణ్‌ తేజ్‌ మాట్లాడాడు.

‘ఫిదా’ సినిమాలో నటించి హిట్‌ జోడీగా పేరుగాంచారు హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ సాయి పల్లవి. ఎన్‌ఆర్‌ఐగా వరుణ్‌, తెలంగాణ అమ్మాయిగా పల్లవి ఆకట్టుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఇద్దరూ కలసి మరో సినిమా రాలేదు. ఎందుకు వరుణ్‌ ఇలా అని అడిగితే… మా కాంబినేషన్‌లో సినిమా తీసుకురావడానికి సన్నాహాలు జరిగాయని చెప్పారు. ఇద్దరం కథ విన్నామని, అయితే ఈసారి చేస్తే ‘ఫిదా’ సినిమాను మించి ఉండాలని అనుకున్నామని తెలిపారు.

అలా అనుకోకుండా ఉంటే ఈ పాటికే మరోసారి కలసి నటించేవాళ్లం అని కూడా చెప్పాడు వరుణ్‌. దీంతో వరుణ్‌ – సాయిపల్లవి కొత్త సినిమా కోసం ‘ఫిదా’ను మించిన కథను సిద్ధం చేయండి అని ఇద్దరి ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ఇక గతంలో చేసిన ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నామని కూడా వరుణ్‌ చెప్పాడు. అలాగే ఓ మల్టీస్టారర్‌లో నటించే అవకాశం వచ్చినా కథ నచ్చకపోవడంతో చేయలేదని చెప్పాడు. మరి ఎవరితో నటించాలని అనుకుంటున్నారు అని అడిగితే… నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమా చేయాలని ఉంది అని చెప్పాడు.

ఇండస్ట్రీలో తనకు నితిన్‌ మంచి స్నేహితుడని చెప్పిన వరుణ్‌.. సినిమా హిట్‌ అయినా ప్లాఫ్‌ అయినా నెక్స్ట్‌ సినిమాకి ఒకేలా కష్టపడతానని చెప్పాడు. ‘గాండీవధారి అర్జున’ సినిమాలోని హీరో క్యారెక్టర్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేకపోవడమే ఆ సినిమా ఫలితానికి కారణం అని చెప్పాడు. ఇక వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus