Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా హార్రర్ సినిమా రీమేక్?

హార్రర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.కానీ దానికి కామెడీని జోడించి.. మన వాళ్ళు హార్రర్ కామెడీ అనే కొత్త జోనర్ ను సృష్టించి హిట్లు అందుకోవడం మరో ఆనవాయితీగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలకు డిమాండ్ తగ్గింది. ఓటీటీ ల హవా పెరిగిన తర్వాత జనాలు సీరియస్ గా సాగే సినిమాలను చూడటం అలవాటు చేసుకున్నారు. ఆ విషయాన్ని ఇటీవల వచ్చిన విరూపాక్ష ప్రూవ్ చేసింది. ఏప్రిల్ 21 న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. అందుకే ఇది సక్సెస్ ఫార్ములా అని హీరోలు, దర్శకులు భావిస్తున్నారు. గతేడాది బాలీవుడ్ లో హిట్ అయిన ‘భూల్ భులాయా 2’ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడు తీసిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. రీమేక్ లు తెరకెక్కించడంలో అతను సిద్ధహస్తుడు. దాంతో.. `భూల్ భులాయా 2` ఆఫ‌ర్ కూడా ఆయ‌న‌కే రావడం జరిగింది. జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఈ చిత్రంలో హీరోగా (Varun Tej) వ‌రుణ్‌ తేజ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. అతను ఎంతో ఇష్టపడి చేసిన గని పెద్ద ఫ్లాప్ అయ్యింది.ఎఫ్3 పర్వాలేదు అనిపించినా అది పూర్తిగా వరుణ్ తేజ్ అకౌంట్లోకి రాదు. గద్దల కొండ గణేష్ సక్సెస్ కూడా హరీష్ శంకర్ ఎకౌంట్ లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితిలో వరుణ్ తేజ్ ఉన్నాడు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus