వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. మనీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాకు అర్బన్ ఏరియాస్ లో బుకింగ్స్ బాగానే ఉన్నాయి. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. వరుసగా విజయాలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డబ్బు విషయంలో తన అనుభవాల గురించి చెబుతూ వరుణ్ తేజ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. డబ్బు విషయంలో నాకు చాలా అనుభవాలు ఉన్నాయని కొన్ని వృత్తుల్లో డబ్బు సులువుగా వస్తుందని అనిపిస్తుందని అయితే ఎంత ఈజీగా వస్తుందో అంతే ఈజీగా పోతుందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఏదో ఒక సమయంలో అర్థమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.
కష్టపడితే తక్కువ డబ్బు వచ్చినా ఆ డబ్బు మనతో ఎక్కువ రోజులు ఉంటుందని డబ్బును తేలికగా తీసుకోకూడదని ఎక్కువగా ఉన్నా వెంటనే ఖర్చు చేయకూడదని వరుణ్ తేజ్ వెల్లడించారు. డబ్బుంది కదా అని ఎగరకూడదని జాగ్రత్తగా దాచుకొని కొంచెం ఖర్చు చేయాలని డబ్బు గురించి నేను నేర్చుకున్న జ్ఞానం ఇదేనని ఆయన వెల్లడించారు. తాను పదో తరగతి చదివే సమయంలో నాన్న 50 రూపాయలు ఇచ్చేవారని వరుణ్ అన్నారు.
ఆ డబ్బుతోనే బస్సు ఎక్కాలని సినిమాకు వెళ్లాలని ఆ డబ్బుతోనే ఎడ్జెస్ట్ కావాలని కొన్నిసార్లు స్నేహితులు నాకోసం డబ్బు ఖర్చు చేసేవారని మరి కొన్నిసార్లు నేను స్నేహితులకు డబ్బు ఖర్చు చేసేవాడినని వరుణ్ తేజ్ వెల్లడించారు. ఎఫ్3 సినిమాలో పోషకాహార లోపం వల్ల నత్తితో బాధపడే కుర్రాడిగా వరుణ్ తేజ్ నటించారు. వెంకీ, వరుణ్ ఖాతాలో ఎఫ్3 సినిమాతో హిట్ చేరుతుందేమో చూడాలి.