‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ‘వాసు’ ‘జెమిని’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఆ టైములో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైంది ‘వసంతం’ చిత్రం. తమిళ దర్శకుడు విక్రమన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్ మరియు ఎస్.సాయి నాగ అశోక్ కుమార్ లు కలిసి నిర్మించారు.2003వ సంవత్సరం జూలై 11న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పోటీగా రాజమౌళి- ఎన్టీఆర్ ల ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉన్నప్పటికీ ఆ పోటీని తట్టుకుని మరీ నిలబడి మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 18ఏళ్ళు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
5.22 cr
సీడెడ్
1.35 cr
ఉత్తరాంధ్ర
1.26 cr
ఈస్ట్
0.53 cr
వెస్ట్
0.55 cr
గుంటూరు
0.80 cr
కృష్ణా
0.85 cr
నెల్లూరు
0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
10.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
2.47 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
13.36 cr
‘వసంతం’ చిత్రాన్ని రూ.8.7 కోట్లకు కొనుగోలు చేసారు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.13.36 కోట్ల షేర్ ను రాబట్టింది.దీంతో ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.4 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది.