బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… వసుధార రిషి ఉన్నటువంటి కాలేజీకి మహేంద్ర జగతి వస్తారు. అయితే వారిని చూసి రిషి బయటకు వెళ్ళిపోయి వీరు ఉద్దేశం పూర్వకంగా వచ్చారా లేక యాదృచ్చికంగా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు వసుధర జగతి మహేంద్రను చూసి షాక్ అవుతుంది. ఇక సెమినార్ సమయం అవుతుండగా అందరూ రిషి సర్ ఎక్కడ అంటూ రిషి కోసం వెతుకుతూ ఉంటారు.
జగతి మహేంద్ర సర్ రావడంతో రిషి సార్ ఇక సెమినార్ కిరారేమో అనుకుంటుంది. అంతలోపే ఏంజెల్ నేను వెళ్లి రిషి ని తీసుకొస్తానని చెప్పడంతో సరేనని చెబుతారు. రిషి సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మీరు ఒకసారి ట్రై చేయమని వసుధారకు ప్రిన్సిపల్ చెబుతాడు. మరోవైపు మహేంద్ర చూస్తూ ఉంటాడు. ఏంటి సర్ అలా చూస్తున్నారు నేను ఫోన్ చేసిన రిషి సార్ లిఫ్ట్ చేయరనీ వసుదార చెబుతుంది.మీరు రావడంతో రిషి సార్ డిస్టర్బ్ అయ్యారు అయినా మీరు ఎందుకు వచ్చారు సర్ అని వసుధార విసుక్కుంటుంది.
మేమేం కావాలని రాలేదు వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే వచ్చాము అంటూ మహేంద్ర చెబుతాడు. ఇంకా రిషి రాకపోవడంతో విశ్వం వచ్చి రిషి ఇంకా రాలేదా అని అడగడంతో మహేంద్ర నేను వెళ్లి తీసుకొస్తానని చెబుతాడు అంతలోపే రిషి రావడంతో ఒక్కసారిగా మహేంద్ర రిషి ని ప్రేమగా హగ్ చేసుకుంటారు అది చూసిన విశ్వం మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అంటూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రిషి మాట్లాడుతూ ఈయన నాకు చాలా కావాల్సినవారు నాకు గురువుతో సమానం అని చెబుతారు. మహేంద్ర కూడా రిషి గురించి మాట్లాడుతూ నాకు చాలా ఆత్మీయుడు అంటారు.
రిషి ఎవరికైనా ఆత్మీయుడుగా మారాల్సిందే ఈయన గత కొంత సంవత్సరాలుగా మా దగ్గర ఉండడం నిజంగా మా అదృష్టం అంటూ విశ్వం గురించి గొప్పగా పొగుడుతారు. అనంతరం సెమినార్ ప్రారంభమవుతుంది ముందుగా రిషి మాట్లాడుతూ సహనాభవతు, సహనోగుణత్తు శ్లోకంతో స్పీచ్ ని ప్రారంభించి గురు శిష్యుల అనుబంధం గురించి ఆ శ్లోకం యొక్క భావం వివరిస్తారు. అలాగే చదువుకున్నటువంటి ప్రాధాన్యత తెలియజేస్తారు ముఖ్యంగా ఆడవాళ్లు చదువుకోవడం ఎంత ప్రాధాన్యత సంచరించుకుందో వివరిస్తారు.ఇలా చదువు గురించి రిషి గొప్పగా చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా క్లాప్స్ కొడతారు అది చూసి మహేంద్ర జగతి చాలా సంతోషపడతారు.
ఇక వేదికపైకి పాండియన్ వెళ్లిఒకప్పుడు మేము చాలా అల్లరి చేసే వాళ్ళం ఇలా స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడుతున్నాము అంటే అందుకు కారణం రిషి సార్,వసుధార మేడం ఇలాంటి గురువులు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడతారు అనంతరం వీరిద్దరిని సత్కరించాలని కోరగా గెస్ట్లుగా వచ్చినటువంటి మహేంద్ర జగతి మేడం చేతుల మీదుగా సత్కరించాలని చెబుతారు దీంతో మహేంద్ర జగతి వసుధార, రిషికి శాలువా కప్పి ఓకే ఇచ్చి వారిని సన్మానిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.