నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. ‘అఖండ’తో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య.. రీసెంట్ గా ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక లొకేషన్లు, స్క్రీన్లలో రిలీజయింది. ఈ సినిమాకి హైప్ కూడా బాగా రావడంతో ఈ ఎడ్వాంటేజ్ ని సినిమా బాగా వాడుకుంది.
ఈ సినిమాకి తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా.. అది వసూళ్ల మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బాలయ్య కెరీర్లో అతి పెద్ద రిలీజ్ కావడం, ఫుల్ హౌస్‌లతో నడవడం వల్ల తొలి రోజు భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. తొలిరోజు రూ.25.36 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ రూ.50 కోట్లకు పైగానే వచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది. ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం బాలయ్య కెరీర్ లో ఇదే తొలిసారి.
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన 15వ సినిమాగా ‘వీరసింహారెడ్డి’ నిలిచింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ‘పుష్ప’ని బీట్ చేసింది. ‘పుష్ప’ సినిమాకి మొదటిరోజు రూ.24.90 కలెక్షన్స్ రాగా.. ‘వీర సింహారెడ్డి’ రూ.25.36 కోట్లు రాబట్టింది. రూ.74.11 కోట్ల కలెక్షన్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు నుంచి ‘వీర సింహారెడ్డి’ సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించే ఛాన్స్ ఉంది.
‘వీర సింహారెడ్డి’ రిలీజైన నెక్స్ట్ డే ‘వాల్తేర్ వీరయ్య’ విడుదలైంది. ఇక ఈరోజు ‘వారసుడు’ సినిమా విడుదలైంది. కాబట్టి కలెక్షన్స్ ని ఈ సినిమాలతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తనకున్న అడ్వాంటేజ్ తో ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి!