నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువగా విలన్లే హైలెట్ అవుతుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే .. బాలయ్య సినిమా అంటే పక్కా మాస్ అంశాలు ఎన్నో ఉండాలి. కాబట్టి విలన్ తో చాలా ఎక్కువ పని ఉంటుంది. బాలయ్యకి.. విలన్ గా చేశాడు కాబట్టే జగపతి బాబు సక్సెస్ ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నాడు. శ్రీకాంత్ కూడా అఖండ లో బాగా హైలెట్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ లో బాలయ్యకి ధీటుగా నటించాడు. అఖండ వల్ల శ్రీకాంత్ కు రాంచరణ్ – శంకర్ ల సినిమాలో విలన్ ఛాన్స్ దక్కింది. అందుకే బాలయ్య.. వీరసింహారెడ్డిలో విలన్ ఛాన్స్ వస్తే మారు మాట్లాడకుండా ఓకె చెప్పేశాడు కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్. అయితే అతను ఆశించింది వీరసింహారెడ్డి తో జరగలేదు, జరగడం లేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో అతని మేకోవర్ బాగానే ఉంది కానీ… అతని క్యారెక్టర్ ను దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేసిన తీరు బాలేదు.
బోయపాటి శ్రీను తెరకెక్కించిన తులసి సినిమాలో రఘుబాబు ఓ డైలాగ్ చెబుతాడు. ‘ మనోళ్లకి… ఇది బాగా అలవాటు అయిపోయింది అన్నా.. ఓ ఎగోసుకుని వెళ్ళడం గుద్దించుకుని రావడం ‘ అనేది ఆ డైలాగ్. వీరసింహారెడ్డి లో దునియా విజయ్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అతని ఇంట్రో సీన్ లో వచ్చే ఫైట్ లో తప్ప… ఆ తర్వాత నుండీ బాలయ్య మీదకు వెళ్ళడం.. తన్నించుకుని రావడం… , క్లైమాక్స్ వరకు అతని పాత్ర తీరు ఇలానే ఉంటుంది.
బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు అయితే దునియా విజయ్ పాత్రని పవర్ ఫుల్ గా డిజైన్ చేసేవాడేమో. గోపీచంద్ మాత్రం ఈ విషయంలో తేలిపోయాడనే చెప్పాలి. అయితే దునియా విజయ్ కు మైత్రి వాళ్ళు ఇంకో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారట. ఈసారి సరైన దర్శకుడి సినిమాలో కనుక పడితే దునియా విజయ్ కు ఆశించిన బ్రేక్ రావచ్చు.