Veera Simha Reddy OTT: వీరసింహారెడ్డి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంతమంది ఫస్టాఫ్ బాగుందని చెబుతుండగా మరి కొందరు సెకండాఫ్ బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య అభిమానులను మాత్రం మెప్పించే విధంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది.

బాలయ్య గత సినిమా అఖండ డిజిటల్ హక్కులను సైతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేయగా ఆ సినిమా వల్ల భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి. ఈ రీజన్ వల్లే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. వీరసింహారెడ్డి టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరసింహారెడ్డికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.

ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం డిసైడ్ అవుతుంది. ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరసింహారెడ్డి టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మరికొన్ని గంటల్లో వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో నిలుస్తాయో చూడాల్సి ఉంది. మైత్రీ నిర్మాతలకు ఈ సినిమాలు ఏ స్థాయిలో లాభాలను మిగుల్చు తాయో చూడాల్సి ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus