Venkatesh: వైరల్ గా మారిన స్టార్ హీరో వెంకటేష్ పోస్ట్!

స్టార్ హీరో వెంకటేష్ ఈ ఏడాది నారప్ప సినిమాతో సక్సెస్ సాధించారు. త్వరలో వెంకటేష్ నటించిన దృశ్యం2 రిలీజ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దృశ్యం2 థియేటర్లలో రిలీజవుతుందో లేక ఓటీటీలో రిలీజవుతుందో తెలియాల్సి ఉంది. మరోవైపు వెంకటేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. సినిమాలతో పాటు లైఫ్ లెసన్స్ కు సంబంధించిన విషయాలను సైతం వెంకటేష్ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

నమ్మకం, ప్రేమ, రిలేషన్స్ కు సంబంధించిన కోట్స్ ను వెంకటేష్ షేర్ చేస్తుండగా ఆ కోట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా వెంకటేష్ నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ దుర్వినియోగం చేయవద్దని నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పవద్దని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే వాళ్లను మరిచిపోవద్దని వెంకటేష్ వెల్లడించారు. అయితే వెంకటేష్ పోస్ట్ ను చూసిన కొంతమంది నెటిజన్లు చైసామ్ లకు వెంకటేష్ హితబోధ చేస్తున్నారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేష్ ఎఫ్3 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 25వ తేదీన ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది. ఎఫ్2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఎఫ్3 సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎఫ్3 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమాతో వెంకటేష్, వరుణ్ తేజ్ ఖాతాలలో భారీ బ్లాక్ బస్టర్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus