విక్టరీ వెంకటేష్ గతేడాది ‘ఎఫ్2’ తో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా ‘వెంకీమామ’ సూపర్ హిట్ కూడా కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. అదే జోష్ లో ఇప్పుడు ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కు ఇది రీమేక్ కావడం విశేషం. అయితే ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు చాలా మంది ట్రోలింగ్ చేసారు.
ఫ్యామిలీ చిత్రాలు, మంచి మంచి అనే పదాలు ఎక్కువ వాడే డైరెక్టర్ ఇంత వైలెన్స్ తో కూడుకున్న అదీ మాస్ సినిమా తీయగలడా అని కొంతమంది ట్రోల్ చేసారు. అయితే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక ఆ ట్రోలింగ్ ఆగి పోయింది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే.. 60 శాతం పూర్తయ్యింది అని టాక్. ఇప్పుడు అయితే షూటింగ్ వాయిదా పడింది.
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి వెంకటేష్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. తన సొంత బ్యానర్లో రూపొందే సినిమా కాబట్టి… పారితోషికం తీసుకోడు అని కూడా ఫిక్సయిపోయారు. అయితే ఈ చిత్రానికి గాను.. ప్రస్తుతానికి వెంకీ రూపాయి కూడా తీసుకోలేదట. అయితే లాభాల్లో వాటా తీసుకుంటాడని సమాచారం.వెంకీ కెరీర్ లో ఇలా చెయ్యడం ఇదే మొదటిసారట. ఇక ఈ చిత్రానికి ‘వి క్రియేషన్స్’ వారు కూడా సహానిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.