తమిళ హీరో సూర్యకు తమిళంలోనే కాదు, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే, ఆయన సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంత ఎదురు చూస్తారో. అంతకన్నా ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణం, సూర్య చేస్తున్న ప్రయోగాత్మక పాత్రలు, సరికొత్త కధలతో తాను వినిపిస్తున్న రికార్డుల ప్రభంజనాలు. సూర్య చేసిన ప్రయోగాత్మక పాత్రల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.
1.నంద
ఈ చిత్రంలో మాస్ హీరోగా మెప్పించాడు సూర్య. కట్ చేస్తే…అత్యంత ప్రతిష్టాత్మకమైన తమిళ నాడు రాష్ట్ర అవార్డ్ అతని సొంతం అయ్యింది.
2.మౌనం పెసియాదే
ప్రేమపై గౌరవం ఉన్న వ్యక్తిగా, మౌనంగా ప్రేమించే ప్రేమికూడిన ఈ సినిమాలో సూర్య నటన అద్భుతం.
3.కాక..కాక
ఈ చిత్రంలో పోలీసు పాత్రలో, దూకుడుగా ఉంటూనే, జ్యోతికను ప్రేమించే క్రమంలో లవర్ బోయ్ లాగా నటిస్తాడు.
4.పితామగన్
ఈ చిత్రంలో విక్రమ్ తో కలసి మల్టీ స్టారర్ లో నటించిన సూర్య తనదైన సరికొత్త నటనతో క్రిటిక్స్ మన్నలను పొందాడు.
5.పెరాజగన్
వికలాంగుని పాత్రలో, కళ్ళు కనిపించని అమ్మాయికి అన్నీ తానై నటించే పాత్రలో సూర్య జీవించాడు.
6.గజిని
బహుశా ఈ సినిమాలో ‘సంజయ్ రామ స్వామి’ పాత్రం ఎప్పటికీ మరచిపోలేనిది అంటే అతిశయోక్తి కాదు.
7.సిలును
ఎమోషనల్ అండ్ రొమాంటిక్ కంటెంట్ ఉన్న పాత్రలో సూర్య మెప్పించాడు.
8.వారనమ్ ఆయిరమ్
డ్యూయెల్ రోల్ లో నటించిని మెప్పించాడు. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను మాత్రం కొల్లగొట్టింది ఈ చిత్రం.
9.ఆయన్
ఏ.వీ.ఎం నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ చిత్రం సూర్య కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
10.సింగం
ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్స్ తో షేక్ చేసింది.
11.రక్త చరిత్ర 2
సూర్య లోని విలనిజాన్ని బయటపెట్టిన మొట్టమొదటి చిత్రం. ఈ సినిమాలో హీరోని చంపే క్రమంలో సూర్య తన పాత్రలో జీవించాడు.
12. 7అమ్ అరివు
సరికొత్త కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రంలో డ్యూయెల్ పాత్రల్లో సూర్య సూపర్ గా నటించాడు.
13.మట్రాన్
రెండు భుజాలు కలసి ఉన్న వికలాంగుడి పాత్రలో సూర్య నటన అమోఘం.
14.పశాంగ-2
చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికీ ఈ ప్రయోగాత్మక చిత్రంలో సూర్య నటించడం నిజంగా హర్షించదగ్గ విషయం.
ఇలా సూర్య తనదైన శైలిలో ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకుపోతున్నాడు.