కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినా కానీ.. వరుస మరణాలు, ప్రమాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్, గాయని వాణీ జయరాం మరణ వార్త ఇంకా మర్చిపోకముందే.. 23 రోజులుగా ఆసుపత్రిలో పోరాడుతున్న నటుడు నందమూరి తారక రత్న కన్నుమూశారు.. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మైల్ స్వామి, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.కె. భగవాన్ కూడా తుదిశ్వాస విడిచారు.. మంగళవారం (ఫిబ్రవరి 21) ఉదయం సీనియర్ ఎడిటర్ జీ జీ కృష్ణారావు మరణించారనే వార్త వైరల్ అవుతుండగానే..
మరో ప్రముఖ నటి ఇకలేరనే వార్తతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది.. సీనియర్ నటి బేలా బోస్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.. ఆమె వయసు 79 సంవత్సరాలు.. బేలా బోస్ మరణంతో హిందీ, భోజ్‌పురి ఇండస్ట్రీలలో విషాదం నెలకొంది.. సినీ రంగానికి చెందిన వారు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.. కాగా బేలా బోస్ 1950లలో తండ్రి మరణం తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చారు. కుటుంబ పోషణ కోసం డ్యాన్సర్‌గా పని చేశారు బేలా బోస్..
రాజ్ కపూర్ నటించిన ‘మేన్ నషే మేన్ హూ’ సినిమాతో డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1962లో నటిగా మారి.. గురు దత్‌కు జోడీగా ‘సౌటేలా భాయ్’ సినిమాలో నటించారు.. ఆమె ప్రముఖ దర్శకుడు ఆశిష్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ‘జై సంతోషీ మాత’ చిత్రంలో కలిసి యాక్ట్ చేశారు.. బేలా డ్యాన్సర్, యాక్ట్రెస్‌గానే కాక, పద్యాలు రాయడం, పెయింటింగ్స్ వేయడం, స్విమ్మింగ్ వంటి వాటిలో కూడా ప్రతిభ కనబర్చడం విశేషం..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?