‘రెండేళ్ల తర్వాత వెకేషన్‌కి వెళ్తున్నాం’ అంటూ ఆ మధ్య ఉపాసన ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు గుర్తుందా? రామ్‌చరణ్ – ఉపాసన ఆ వెకేషన్‌కి వెళ్లి తిరిగి వచ్చేశారు కూడా అంటారా? అవును మీరు చెప్పింది నిజమే. వాళ్లు వెనక్కి వచ్చేశారు. అంతేకాదు అక్కడ వాళ్లు ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను ఉపాసన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక్కడి నుండి బయలుదేరి అక్కడికెళ్లి, ఆ తర్వాత అక్కడ విహార ప్రదేశాల్లో ఎంజాయ్ చేసి, తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన మొత్తం విషయాలను ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోలో షేర్ చేశారు ఉపాసన.
‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’ పనులు… కరోనా కష్టాల కారణంగా రామ్‌చరణ్ గత రెండేళ్లుగా ఉపాసనను వెకేషన్‌కి తీసుకెళ్లలేదు. తాజా కుటుంబ సభ్యుల హారిక, ఆర్షిత్‌తో కలసి ఫిన్‌లాండ్ పయనం కట్టారు రామ్‌చరణ్ దంపతులు. అక్కడి మంచు ప్రదేశంలో ఈ నలుగురు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రత్యేకం విమానంలో అక్కడికి వెళ్లిన ఆర్సీ అండ్ ఉప్సీ… ఆ మొత్తం విషయాలు భద్రపరిచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఎయిర్‌పోర్ట్ ట్రాలీలో చరణ్ కూర్చుంటే ఉపాసన నెట్టుకుంటూ వెళ్లడం, అలాగే ఉపాసన ట్రాలీపై నిలబడితే…
చరణ్ నెట్టుకుంటూ రావడం, ఆ తర్వాత అక్కడ చల్లని నీటిలో ఆడుకోవడం, ఫైర్ దగ్గ చలికాచుకోవడం, మంచు జంతువులతో సరదాగా ఆటలాడుకోవడం, పెంపుడు శునకాలను మచ్చిక చేయడం, ఐస్ మీద స్కీయింగ్ చేయడం… ఇలా ఒక్కటేంటి రామ్‌చరణ్, ఉపాసన ఓ రకంగా చిన్న పిల్లల్లా మారిపోయారు. ఆ వీడియోలో వీటితోపాటు ఇంకొన్ని సరదా సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసుకొని వచ్చేసిన చరణ్ త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రచారం షురూ చేస్తారు.
ఈ నెల 25న సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులన్నీ పూర్తయ్యాక… ‘ఆచార్య’ విడుదల పనుల్లో బిజీ అయిపోతాడు. ఆ వెంటనే శంకర్ – దిల్ రాజు సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. అది జరుగుతుండగానే జులైలో గౌతమ్ తిన్ననూరి – యూవీ క్రియేషన్స్ సినిమా ప్రారంభిస్తారని సమాచారం.