“నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి సంపాదించిన మొత్తంలో దాదాపు 70% ఖర్చు చేసి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా తీశాను. ఈ సినిమాకి రిటర్స్ వస్తాయా లేక లాభాలు వస్తాయా అనే లెక్కలు వేసుకొని ఈ సినిమా తీయలేదు. నాకు ఇంత ఇచ్చిన ఇండస్ట్రీకి నేను కూడా కొంత తిరిగి ఇవ్వాలన్న ఒకే ఒక్క బలమైన నిర్ణయంతోనే సినిమా నిర్మాణ రంగంలోకి దిగాను. ఈ సినిమాకి మా నాన్న నిర్మాత అనే విషయం ఆయన ఎప్పుడు నమ్మలేదు. కానీ.. డిజిటల్ రైట్స్ & ఆడియో రైట్స్ అమ్ముడవ్వడం, సునీల్ గారు మా సినిమాను కొని మొదటిసారి అడ్వాన్స్ తెచ్చి మా నాన్న చేతిలో పెట్టినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు చూశాను, మేము నిర్మించిన మొదటి సినిమాకి అడ్వాన్స్ వచ్చినప్పుడే ఆయన నిర్మాత అని ఫీల్ అయ్యాడు మా నాన్న.
నా జీవితంలో అది ప్రౌడ్ మూమెంట్. ఆయన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అదే నాకు ఇష్టం. ఇలా ‘మీకు మాత్రమే చెప్తా’ నాకు చాలా గోల్డెన్ మెమరీస్ ను ఇచ్చింది. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్’ అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.తరుణ్ భాస్కర్, అభినవ్, అనసూయ, అవంతిక కీలకపాత్రలు పోషించిన “మీకు మాత్రమే చెప్తా” ఇవాళ విడుదలవుతుంది. మరి విజయ్ దేవరకొండ ఆశలను ఈ సినిమా ఏమేరకు నెరవేరుస్తుందో చూడాలి. ఈ సినిమా నటుడిగా తరుణ్ భాస్కర్ కి కూడా చాలా కీలకం.