ఒక సక్సెస్ వచ్చిందంటే హీరో/హీరోయిన్ రేంజ్ మొదలుకొని స్టార్ డమ్, స్టేటస్ లతోపాటు రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంటుంది. అయితే.. ఆ పెంచడం అనేది మరీ ఒకేసారి పెరిగే పెట్రోల్ రేటులా కాకుండా అప్పుడప్పుడూ పెరుగుతూ తగ్గుతూ ఉండే బంగారం రేటులా ఉండాలి. కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం ఒక్కసారిగా వైట్ పెట్రోల్ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచేశాడు. “పెళ్ళిచూపులు”తో సూపర్ హిట్ ను, “అర్జున్ రెడ్డి”తో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకొన్న విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా.. ఉన్నపళంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచేశాడట.
ప్రస్తుతం “గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2” బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. అనంతరం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకొన్నాడు. ఇవి కాకుండా ఎవరైనా కొత్త దర్శకనిర్మాతలు తనను అప్రోచ్ అయితే మాత్రం సింపుల్ గా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట. నానీకే ఇప్పుడిప్పుడు మూడు నుంచి 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కొందరు దర్శకనిర్మాతలు సంకోచిస్తున్నారు. అలాంటిది కేవలం రెండు హిట్లు కొట్టిన విజయ్ దేవరకొండ మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.