Vijay, Samantha: ‘ఖుషీ’ టైటిల్ ను వాడేస్తున్న యంగ్ డైరెక్టర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘ఖుషీ’. ఈ సినిమా ఆయన కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్. ‘ఖుషీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్, ఆయన కామెడీ టైమింగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను మళ్లీ వాడాలనుకుంటున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు శివ నిర్వాణ.. తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో చేయనున్నారు.

Click Here To Watch NOW

ఇందులో స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించనుంది. విజయ్ దేవరకొండ- సమంత కాంబినేషన్ లో సినిమా అనేసరికి మంచి బజ్ క్రియేట్ అవుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘మహానటి’ సినిమాలో జోడీగా కనిపించారు. అయితే తెరపై కనిపించేది కాసేపే. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాకి ‘ఖుషీ’ అనేది వర్కింగ్ టైటిల్. మరి ఈ టైటిల్ ను పర్మినెంట్ చేస్తారా..? లేక మరో టైటిల్ పెడతారో చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ నెలలలోనే సినిమాను మొదలుపెట్టనున్నారు. ఎనభై రోజుల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కశ్మీర్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాను పూర్తి చేసి ఇప్పుడు ‘జేజీఎం’ అనే మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో నటిస్తూనే.. శివ నిర్వాణ షూటింగ్ లో పాల్గొనున్నారు విజయ్ దేవరకొండ.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus