రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేడు ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా నేడు విడుదలవుతున్నటువంటి సందర్భంగా ఈయన భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు నిర్మాతలు వ్యవహరించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైనటువంటి రవిశంకర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిద్దరి మధ్య జాతీయ అవార్డుల గురించి ప్రస్తావనకు వచ్చింది. 69వ జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించినటువంటి ఉప్పెన సినిమాకు పుష్ప సినిమాకు అవార్డులు రావడంతో నిర్మాత రవిశంకర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా మైత్రి నిర్మాణంలో ఖుషి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది.ఇకపోతే పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఈ అవార్డుల గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఉత్తమ నటుడిగా (Vijay Devarakondav) మాత్రమే కాకుండా నా దృష్టిలో దర్శకుడికి కూడా ఈ అవార్డు రావాల్సి ఉందని తెలిపారు.
ఉత్తమ నటుడితో పాటు డైరెక్టర్ కి కూడా ఈ అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని తెలిపారు. ఈ సినిమా కోసం సుకుమార్ గారు చాలా కష్టపడ్డారు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ అవార్డు ఎంపికకు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. బహుశా అలా మిస్ అయి ఉండవచ్చు కానీ పుష్ప 2 కి మాత్రం తప్పనిసరిగా జాతీయ అవార్డు వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!