అదేదో సినిమాలో ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ అని చెప్పినట్లు మనం ‘బాలీవుడ్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని అనాలి. ఎందుకంటే కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత హిందీ సినిమా పరిశ్రమ పరిస్థితి అలా అయిపోయింది. ఒకప్పుడు ఎలాంటి కథ తీసినా మినిమమ్ విజయం పక్కా అని అనుకునేవారు. ఇప్పుడు ఎంతటి డిఫరెంట్ కథ తీసినా అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులు సైతం తమ పరిశ్రమ పరిస్థితి ఏమంత బాగోలేదు అనే అంటున్నారు. ఈ క్రమంలో తమ పరిశ్రమలో మార్పులు వస్తేనే బాగుపడతాం అని కూడా అంటున్నారు. అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అదే అంటున్నా కాస్త డిఫరెంట్‌గా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుందని చెప్పిన ఆయన.. వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లు పైకి తీసుకొస్తారని కామెంట్ చేశాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దక్షిణాది సినీ పరిశ్రమ ఇప్పుడు రాణిస్తోంది. విదేశాల్లో మన సినిమాకు ఆదరణ పెరుగుతోంది. ఒకానొక సమయంలో మన సినిమాలకు సరైన గుర్తింపు ఉండేది కాదు. రానున్న ఐదు పదేళ్లలో ఈ పరిస్థితుల్లో ఇంకా మార్పు రావొచ్చు అని అన్నాడు విజయ్. బాలీవుడ్‌లో ఇప్పుడు ఓ లోటు ఉందని, అందుకే సినిమాల ఫలితాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నాడు. అయితే ఆ లోటును భర్తీ చేసేందుకు కొత్త దర్శకులు పుట్టుకొస్తారని, వాళ్లు బాలీవుడ్ వాళ్లు కారు అని అన్నాడు.
దీంతో విజయ్ ఎవరి గురించి మాట్లాడాడు అనే ప్రశ్న మొదలైంది. అయితే ఆయన చెప్పిన ఇతర భాషల దర్శకుల హవా ఇప్పటికే బాలీవుడ్‌లో కొత్తదనం కనిపిస్తోంది. దానికి తీసుకొచ్చింది సౌత్ దర్శకులే. కాబట్టి విజయ్ చెప్పిన మార్పు.. అదేనండి భారీ విజయాలు మొదలయ్యాయి.