Vijay Deverakonda: రౌడీ క్లాత్ ఇప్పుడు రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్..ఫ్యాన్స్ కి పండగే..!

విజయ్ దేవరకొండ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో పెళ్లిచూపులు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశాడు విజయ్. ఈ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు, అతని యాటిట్యూడ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

దానితో ఓవర్ నైట్‌లోనే (Vijay Deverakonda) విజయ్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డితో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ ముద్దుగా ‘రౌడీ బాయ్’ అని పిలుస్తూ ఉంటారు. ఆయన అభిమానులను ‘రౌడీస్’ అంటుంటారు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ… ఫ్యాషన్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని సొంత రౌడీ క్లాత్ బ్రాండింగ్ ద్వారా చూపిస్తున్నారు. ‘రౌడీ క్లాత్’ బ్రాండింగ్ ఇప్పటికే యువతలో క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు ఆయన ఆ బ్రాండ్‌ను ‘రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్’ పేరుతో రీ లాంఛ్ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ‘రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్’ రీ లాంఛ్ కాబోతోంది. ఫ్యాషన్ రంగంలో ఇండియన్ ఆధిపత్యాన్ని రౌడీ క్లాత్ బ్రాండింగ్ ముందుకు తీసుకెళ్తుందని సగర్వంగా ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఈ క్లాతింగ్ బ్రాండ్ రేట్స్, వివరాలు ప్రస్తుతానికి ప్రకటించలేదు. ఎర్లీ యాక్సెస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘గీత గోవిందం’ తర్వాత ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్లతో మరో సినిమా చేస్తున్నారు. దానికి ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ ఖరారు చేశారు. అందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఆ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. అయితే… ప్రస్తుత పరిస్థితులను చూస్తే వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కావడం కష్టం అని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus