‘పెళ్లిచూపులు’ చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మలి చిత్రం ‘అర్జున్‌రెడ్డి’తో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవడంతో విజయ్ దేవరకొండకి యూత్‌లో విశేషమైన క్రేజ్ ఏర్పడింది. కేవలం రెండు చిత్రాలతో ఇంతటి క్రేజ్‌ని, పాపులార్టీని సంపాదించుకున్న విజయ్ దేవర కొండ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్ రాజా తెలుగు, తమిళ్‌లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం. 14 చిత్రం మార్చి 5న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, మైత్రి మూవీస్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, స్వప్న దత్, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్, సందీప్ రెడ్డి వంగ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మెహరీన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, సందీప్ రెడ్డి వంగ, కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం ఏర్పాటైన ప్రెస్‌మీట్‌లో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మెహరీన్ దర్శకుడు ఆనంద్ శంకర్, నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా, కెమెరామెన్ శాంత, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, డిజైనర్ శ్రావ్య పాల్గొన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ”రోజులు చాలా ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్ రాజాగారి బేనర్‌లో సినిమా చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. స్క్రిప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఫస్ట్‌టైమ్ తెలుగు, తమిళ్‌లో సినిమా చేస్తున్నాను. సినిమా ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని యాంగ్జైటింగ్‌గా వుంది. బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో అంతే టెన్షన్‌గా అనిపిస్తుంది. డేట్స్ లేకపోయినప్పటికీ స్క్రిప్ట్ నచ్చడంతో.. ఎలాగైనా సినిమా చేయాలని డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమాకి ఓకే చెప్పాను. స్క్రిప్ట్ ఖతర్నాక్‌గా వుంది. యంగ్ టాలెంటెడ్ టీమ్‌తో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది” అన్నారు.
నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ – ”అర్జున్‌రెడ్డి’ మూవీ ఐదుసార్లు థియేటర్‌లో చూశాను. విజయ్ దేవరకొండ అమేజింగ్ యాక్టర్. స్టూడియో గ్రీన్ బేనర్‌లో ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ తెలుగు సినిమా విజయ్ దేవరకొండ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. మా ఫస్ట్ ఫిలిం హీరో విజయ్. ఆనంద్ శంకర్ బిగ్ మూవీస్ చేశారు. స్క్రిప్ట్ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ కథకి విజయ్ అయితే కరెక్ట్ యాప్ట్ అని నమ్మి సినిమా తీస్తున్నా. శాంత కెమెరా, సి.ఎస్. శ్యాం మ్యూజిక్, ఆర్ట్ కిరణ్ అంతా బిగ్ మూవీస్‌కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. మార్చి 8 నుండి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో చేసి సెకండ్ షెడ్యూల్ చెన్నైలో చేస్తాం” అన్నారు.
దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ – ”విక్రమ్‌తో ‘ఇంకొక్కడు’ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నాను. చెన్నైలో ‘అర్జున్‌రెడ్డి’ మూవీ చూశాను. బాగా నచ్చింది. ఆ సినిమా అన్ని భాషల్లో మంచి హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ పెర్‌ఫార్మెన్స్‌కు గ్రేట్ అప్రిషియేషన్ వచ్చింది. తను ఈ స్క్రిప్ట్ విని ఎగ్జైట్ అయ్యాడు. తమిళ్ నేర్చుకొని డైలాగ్స్ చెబుతా అన్నాడు. అది తన కమిట్ మెంట్ ఏంటో చెబుతుంది. చాలా ప్యాషనేట్ హీరో. జ్ఞానవేల్ రాజా బిగ్ ప్రొడ్యూసర్. రవి కె. చంద్రన్ సన్ శాంత ఈ సినిమాకి డి.ఓ.పి చేస్తున్నాడు. సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది” అన్నారు.
హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ – ”విజయ్ దేవరకొండతో ఇటీవల ఒక హోలి సాంగ్‌లో నటించాను. వెంటనే ఫుల్‌ప్లెడ్జ్‌డ్ హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నాను. వెరీ డెడికేటెడ్ యాక్టర్. ఆనంద్ శంకర్ స్క్రిప్ట్ నేరేట్ చేయగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. స్టూడియో గ్రీన్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది” అన్నారు.