ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) కలయికలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘పుష్ప 2’తో (Pushpa 2) భారీ విజయం అందుకున్న బన్నీ, ఆ తర్వాత తన దృష్టిని ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్‌పై నిలిపాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం మేరకు, దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని అల్లు అర్జున్‌తో ముఖాముఖి భేటీకి సిద్ధమవుతున్నారు.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించబోతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్లను టీమ్ సంప్రదించిందని టాక్. కథలో ఊహించని ట్విస్ట్‌లు, విజువల్ వండర్స్‌కు స్కోప్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతోంది. అట్లీ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలతో కలిసి పనులు మొదలుపెట్టారని సమాచారం. బన్నీ క్యారెక్టర్‌కి సంబంధించిన మూడు వేరియేషన్లపై స్పెషల్ గ్రాఫిక్ టెస్టులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది.
ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో బన్నీ, అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి షేర్ చేసిన ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో బన్నీ లుక్‌ను ఆధారంగా తీసుకుని సూపర్ హీరో క్యారెక్టర్‌కి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారతీయ మూలాల్ని ఆధారంగా చేసుకుని ఓ ప్రత్యేక ప్రపంచం సృష్టించనున్నారని అట్లీ హింట్ ఇచ్చారు. ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ అంచనాలు విపరీతంగా పెరిగాయి.
ఇప్పుడు బన్నీ ఇంటికి అట్లీ రానున్న నేపథ్యంలో, స్క్రిప్ట్ చివరి మెరుగులు, షెడ్యూల్ ప్లానింగ్, సెట్ డిజైనింగ్ వంటి అంశాలపై చర్చ జరగనుంది. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే దిశగా టీమ్ స్పీడ్ పెంచింది. కథా నేపథ్యం ప్రపంచ స్థాయిలో ఉంటుందని చెప్పుకుంటున్న ఈ చిత్రానికి A22xA6 అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తోపాటు అధికారిక పోస్టర్, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో చిత్రబృందం ప్రకటించనుంది.