రణం మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. తలా అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రైలర్ రాలేదు అనే మాట ఇండస్ట్రీ నుంచి కూడా వినిపించింది. ఇక తాజాగా ఈ మూవీ తమిళ్ ట్రైలర్ ను వెర్సటైల్ ప్యాన్ ఇండియా యాక్టర్ విజయ్ సేతుపతి చేతల మీదుగా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ను చూసిన విజయ్ సేతుపతి సైతం చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఓ స్టార్ హీరో రేంజ్ లో కనిపిస్తోంది మూవీ అని ప్రశంసించారు. ఇలాంటి మూవీతో డెబ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాగిన్ రాజ్ కు చాలా పెద్ద కెరీర్ ను ఇస్తుందని కితాబునిచ్చాడు. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విజయ్ సేతుపతి వంటి వారి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో బిజినెస్ పరంగానూ తలా ఊహించిన దానికంటే చాలా ఫ్యాన్సీగా వెళుతోంది. అందుకు కారణం ఈ మూవీ కంటెంట్ లో సూపర్ హిట్ గ్యారెంటీ అనే దమ్ము కనిపిస్తోందనే మాటలు బలంగా వినిపిస్తుండటమే. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా తలాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘వయొలెంట్ వాలెంటైన్’అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేయబోతుండటం విశేషం.