ప్రముఖ నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మల ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈమె మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇదిలా ఉండగా విజయ నిర్మల గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి అందరికీ తెలిసిందే. నటిగా, దర్శకురాలిగా ఆమె సంచలనం సృష్టించింది. అయితే ఆరు దశాబ్దాల సినీ రంగ ప్రస్థానంలో ఆమె తన చివరి కోరిక తీరకుండా చనిపోయిందట. విజయనిర్మల కెరీర్లో 44 సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మరే మహిళకు సాధ్యం కాని రికార్డును ఆమె సొంతం అనడంలో సందేహం లేదు. కానీ ఆవిడ టార్గెట్ 50 సినిమాలంట.
విజయనిర్మల టార్గెట్ పూర్తవ్వకుండానే ఆమె తుదిశ్వాస విడిచారట. ‘మీనా’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు విజయ నిర్మల. తెలుగుతో పాటు తమిళంలో కూడా అనేక చిత్రాలని డైరెక్ట్ చేశారు. ‘దేవదాస్’ సినిమా ప్లాపవ్వడంతో దర్శకత్వ బాధ్యతల్ని నుండీ తప్పుకోవాలని భావించిందట. జయాపజయాలు మామూలేనని ఆమె భర్త కృష్ణ నచ్చజెప్పడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల్ని తిరిగి కొనసాగించారు. ఏదేమైనా ఆమె 50 సినిమాల టార్గెట్ చేయాలనుకున్న కల మాత్రం నెరవేరలేదు.