కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విక్రమ్ కు (Vikram) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా తంగలాన్ (Thangalaan) సినిమాతో విక్రమ్ ఖాతాలో మరో భారీ సక్సెస్ చేరింది. అయితే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవం గురించి విక్రమ్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. డైరెక్టర్ మణిరత్నం అంటే నాకెంతో ఇష్టమని విక్రమ్ అన్నారు. మణిరత్నం ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ను తాను ఎంతగానో ఇష్టపడతానని విక్రమ్ వెల్లడించారు.
Vikram
కెరీర్ తొలినాళ్లలో మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్ లో ఒక సినిమా అయినా చేయాలని నేను కలలు కనేవాడినని విక్రమ్ పేర్కొన్నారు. మణిరత్నం డైరెక్షన్ లో నటించిన తర్వాత యాక్టింగ్ కు రిటైర్మెంట్ ఇచ్చినా పరవాలేదని అనిపించిందని ఆయన కామెంట్లు చేశారు. “బొంబాయి” (Bombay) సినిమా ఆఫర్ నాకు వచ్చిందని ఆ సినిమాలో హీరోగా నన్ను ఎంపిక చేశారని ఫైనల్ అడిషన్ లో చేసిన చిన్న తప్పు వల్ల ఆ సినిమా చేజారి పోయిందని విక్రమ్ పేర్కొన్నారు.
బొంబాయి సినిమా కోసం అకస్మాత్తుగా నన్ను అడిషన్ కు పిలిచారని వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరా తెచ్చి సీన్ చెప్పి యాక్ట్ చేయమని కోరారని విక్రమ్ తెలిపారు. స్టిల్ కెమెరా కావడంతో కదిలితే పిక్చర్ బ్లర్ గా వస్తుందని భావించి కదలకుండా డైలాగ్స్ చెప్పడం వల్ల మూవీ ఆఫర్ మిస్ అయిందని విక్రమ్ వెల్లడించారు. దాదాపుగా రెండు నెలలు నేను బాధ పడ్డానని ఉదయం నిద్ర లేవడం ఏడుస్తూ కూర్చోవడమే నా పని అని విక్రమ్ తెలిపారు.
నేను మిస్ చేసుకున్న బొంబాయి మూవీ పాన్ ఇండియా కల్ట్ మూవీ అయిందని విక్రమ్ (Vikram) కామెంట్లు చేశారు. విక్రమ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు తంగలాన్ మూవీ తెలుగులో ఫ్లాపైనా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.