విక్రమ్ వలనే ‘మహావీర్ కర్ణన్’ ఆగిపోయింది?

కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు చియాన్ విక్రమ్. తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించి కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో కూడా విక్రమ్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఆయన హీరోగా ‘మహావీర్ కర్ణన్’ అనే భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ప్రచారం జరిగింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుందని కూడా టాక్ నడిచింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయిందని అంతా అనుకున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోలేదంట. దర్శక నిర్మాతలు ఈ చిత్రం కోసం రెడీ గానే ఉన్నారట. కానీ హీరో విక్రమ్ మాత్రం ఆలస్యం చేస్తున్నారట. విక్రమ్ కొడుకు ‘ధృవ్’ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిత్య వర్మ’ చిత్రం పనుల్లో విక్రమ్ బిజీగా గడుపుతున్నాడట. అన్ని వ్యవహారాలను విక్రమ్ దగ్గరుండీ చక్కబెడుతున్నాడట. తన కొడుకు సినిమా విడుదలయ్యేవరకూ వెయిట్ చేయమని ‘మహావీర్ కర్ణన్’ను హోల్డ్ లో పెట్టాడట. ‘ఆదిత్య వర్మ’ విడుదల తరువాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది.

Share.