‘అపరిచితుడు’ మూవీని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.ఓ పక్క సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే మరోపక్క వైవిధ్యాన్ని కూడా చూపిస్తూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రమిది. 2005లో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించడానికి కూడా రెడీ అవుతున్నాడు శంకర్.ఇదిలా ఉండగా..’అపరిచితుడు’ ముందుగా విక్రమ్ కోసం అనుకున్నది కాదట. ఓ టాలీవుడ్ సీనియర్ హీరో కోసం అనుకున్నదట.
నేను చెబుతున్నది ‘అపరిచితుడు’ టైటిల్ గురించి మాత్రమే..! ముందుగా ఈ టైటిల్ ను ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. టాలీవుడ్ సీనియర్ హీరో కోసం రిజిస్టర్ చేయించాడట. ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు శ్రీను వైట్ల. అవును దర్శకుడు శ్రీను వైట్ల ‘అపరిచితుడు’ టైటిల్ ను హీరో రాజశేఖర్ కోసం రిజిస్టర్ చేయించాడట.1994లోనే ‘అపరిచితుడు’ అనే టైటిల్‌తో రాజశేఖర్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకున్నాడు శ్రీను లైట్ల. నిర్మాత కూడా ఓకే అయ్యాడు.10 శాతం షూటింగ్ కూడా జరిగింది.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఓ నాలుగేళ్ల తర్వాత అంటే 1998 వ సంవత్సరంలో రవితేజతో ‘నీకోసం’ అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీను వైట్ల. ఇక ‘అపరిచితుడు’ టైటిల్ ను 2005 వ సంవత్సరంలో దర్శకుడు శంకర్ అడగ్గా అతనికి ఇచ్చేసాడు శ్రీను వైట్ల.