అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి.వీక్ డేస్ లో డౌన్ అయినా స్టడీగానే రాణించి ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ మూవీ. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.12 cr |
సీడెడ్ | 0.81 cr |
ఉత్తరాంధ్ర | 0.43 cr |
ఈస్ట్ | 0.33 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.23 cr |
కృష్ణా | 0.24 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.51 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.17 cr |
ఓవర్సీస్ | 0.32 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.00 cr (షేర్ |
‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.5 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.50 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.
మొత్తానికి ఈ మూవీ ప్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరంని గట్టెక్కించిందని చెప్పొచ్చు. అయితే అతని గత చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ రేంజ్ లో అయితే ప్రాఫిట్స్ ను అందించలేదు ‘వినరో భాగ్యము విష్ణు కథ’
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్