Virupaksha Trailer: సస్పెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా విరూపాక్ష.!

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం విరూపాక్ష. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసారు.రెండు నిమిషాల ఐదు సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగానే సాగింది. మూడ నమ్మకాలు, చేతబడులు, జనాల వికృత చర్యలు..వంటి ఎలిమెంట్స్ తో సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఫీల్ కలిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ఒక ఊరు అక్కడ అనూహ్యంగా సంభవిస్తున్న మరణాలు .. వంటివి (Virupaksha)ఈ ట్రైలర్ లో కనిపించాయి. ట్రైలర్ కు నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ సంయుక్త మీనన్ భయపెట్టేలా కనిపిస్తుంది. హీరో సాయి ధరమ్ తేజ్ ..ఊరి జనాలను కాపాడే విరూపాక్ష గా కనిపిస్తున్నాడు. అయితే అతను విగ్ పెట్టుకోవడం లుక్ ను డిస్టర్బ్ చేసినట్టు అయ్యింది. దర్శకుడు కార్తీక్ దండు.. ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా చిత్రాన్ని తెరకెక్కించాడు అనే నమ్మకం ట్రైలర్ కలిగించింది.

యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరమైన తేజు ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొంతు సరిగ్గా లేకపోయినా డబ్బింగ్ బాగానే చెప్పుకున్నాడు. కాంతార ఫేమ్ అజ్ నీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. భోగవల్లి ప్రసాద్ తనయుడు బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus