పైరసీ భూతంపై కొన్నాళ్లుగా పోరాడుతున్న విశాల్ శ్రమ ఫలించింది. వందల కోట్ల తో నిర్మితమైన మూవీ వంద రూపాయలకు పంచుతున్న వారిపై యుద్ధంలో గెలిచారు. అత్యధిక క్రేజీ మూవీగా వచ్చిన బాహుబలి కంక్లూజన్ కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. అందుకే విశాల్ తన టీమ్ తో తమిళనాడులో నిఘా పెట్టారు. డీ వీడీలను విక్రయిస్తున్న వారిపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. విశాల్ అందించిన సమాచారం ప్రకారం తమిళనాడులోని బర్మా బజార్, నేతాజీ బజార్, సత్య బజార్, రతన్ బజార్ లలోని కొన్ని షాపులపై పోలీసులు దాడి చేసి 2,100 బాహుబలి కంక్లూజన్ పైరసీ డీవీడీలను కనుగొన్నారు.
వాటిని విక్రయిస్తున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకులు విశాల్ ని అభినందిస్తున్నారు. తెలుగు చిత్రం కోసం ఇంతగా శ్రమించిన విశాల్ ని బాహుబలి బృందం తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.