తండ్రి హఠాన్మరణంతో శోకసంద్రంలో విష్ణుప్రియ..!

గతకొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ప్రముఖ మరాఠీ సీరియల్ యాక్ట్రెస్ కళ్యాణి కురాలే జాదవ్ రోడ్ యాక్సిడెంట్‌లో మరణించారు అనే వార్త వైరల్ అవుతుండగానే.. టాలీవుడ్ సీరియల్ నటి విష్ణు ప్రియ తండ్రి మృతి చెందారనే న్యూస్ మీడియా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.. దీంతో ఆమె కుటుంబంతో పాటు తెలుగు టీవీ పరిశ్రమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.. తెలుగులో ‘అభిషేకం’, ‘ఇద్దరు అమ్మాయిలు’, ‘కుంకుమ పువ్వు’ వంటి పలు సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ విష్ణు ప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది..

తాజాగా ఆమె తండ్రి మరణించారు.. నాన్న మృతితో కొండంత అండను కోల్పోయానంటూ.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యింది విష్ణు ప్రియ.. ఈ మేరకు తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. నాన్న పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ‘‘నాన్న కామెర్ల వ్యాధితో గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇన్ని రోజులుగా మేం చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించలేదు..

ఆయన ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. నా గుండె ఎప్పటికీ కోలుకోలేదు డాడీ.. నా సూపర్ హీరో, నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్‌ని కోల్పోయా.. ఈ కష్టకాలంలో నాకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు.. అలాగే మా నాన్నకి నివాళులర్పించండి’’ అంటూ పోస్ట్ చేసింది.. దీంతో, ‘‘ధైర్యంగా ఉండు.. నాన్న ఎక్కడున్నా ఆయన జ్ఞాపకాలు నీతోనే ఉంటాయం’’టూ విష్ణు ప్రియకు ధైర్యం చెబుతూ.. తోటి నటీనటులు, టీవీ, సినీ ఇండస్ట్రీ వారు.. ఆమె తండ్రి ఆత్మకు శాంతి కలగాలంటూ కామెంట్స్ చేస్తున్నారు..

కాగా.. పాపులర్ సీరియల్ యాక్టర్, కో-స్టార్ అయిన సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది విష్ణు ప్రియ.. ప్రస్తుతం తెలుగులో ‘త్రినయన’, ‘జానకి కలగనలేదు’ లాంటి సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే తమిళ్‌లోనూ కొత్త సీరియల్స్ కమిట్ అయ్యింది.. తండ్రి మరణంతో విష్ణు ప్రియ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus