విశ్వక్ సేన్… టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో ఒకడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్ వంటి చిత్రాలతో క్రేజీ హీరో అనిపించుకున్నాడు. మంచి నటుడు అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇతను టాలెంటెడ్ హీరో అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మొదటి నుండీ ఇతను మాట్లాడే విధానం స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఉంటుంది. ఆటిట్యూడ్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఇతను ఎక్కువగా కష్టపడతాడు.
అంతేకాదు విజయ్ దేవరకొండ లా తను కూడా ఆటి ట్యూడ్. వల్ల తనకు క్రేజ్ ఏర్పడింది అనుకుంటాడు. ఇది నిజమే అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇతను డైరెక్టర్ లు చెప్పినట్టు వినడు. మీడియా అంటే ఐ డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరిస్తాడు. ఇతను ఎక్కువగా వివాదాల్లో ఉంటాడు. సరే అది పక్కన పెట్టేసినా… ఇతని హిట్టు సినిమాలు ఏమైనా మంచి కలెక్షన్లు రాబడతాయా.. అంటే అదీ లేదు.
బ్రేక్ ఈవెన్ కు ఆమడ దూరంలోనే ఆగిపోతాయి. అయినా సరే ఇతనికి థియేట్రికల్ మార్కెట్ ఉన్నట్టు బయ్యర్లు భావిస్తారు.అదంతా ఒక వైపు అయితే.. ఇటీవల ముఖ చిత్రం అనే సినిమాని విశ్వక్ పేరు చెప్పి.. ఎక్కువ రేట్లకు అమ్మారు నిర్మాతలు. అయితే సినిమా 50 శాతం కూడా రికవరీ సాధించలేదు. దీంతో బయ్యర్లు లభో దిభో అంటున్నారు.
అయితే ఇందులో నిర్మాతల తప్పు కానీ విశ్వక్ తప్పు కానీ లేదు. అతను హీరోగా నటించిన సినిమాలకే కలెక్షన్లు రావడం లేదు అన్నప్పుడు … గెస్ట్ రోల్ చేసిన సినిమాకి ఎక్కువ రేట్లు ఎలా పెట్టారు అంటూ చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.