సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసే ప్రెస్మీట్లు.. అందులో భాగంగా రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు.. ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికీ తెలుసు. ‘హీరో లేదా ఆ సినిమాకు సంబంధించిన ఫిలిం మేకర్స్ ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడిగి కెమెరాల ముందు, సోషల్ మీడియాలో వైరల్ అయిపోదాం’ అని చాలా మంది రిపోర్టర్లు మైక్ పట్టుకుంటున్నారు. కొంతమంది అయితే బేసిక్ సెన్స్ కూడా లేకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు.
Vishwak Sen
అందుకే రిపోర్టర్ల మొహాలపై కెమెరాలు తీసేయడం కూడా జరిగింది. అయినా ఇలాంటి ప్రశ్నలు రిపోర్టర్లు ఆపడం లేదు. తాజాగా విశ్వక్ సేన్ ను (Vishwak Sen) ఓ రిపోర్టర్ ఇలాగే పిచ్చిగా ప్రశ్నించాడు. అందుకు విశ్వక్ సేన్ అతన్ని ‘అరె ఒరే అంటూ అమర్యాదగా సమాధానం చెప్పి’ వార్తల్లో నిలిచాడు. ‘ లైలా’ (Laila) సినిమా సాంగ్ లాంచ్ వేడుకలో భాగంగా ఇదంతా జరిగింది.
ఆ రిపోర్టర్ మాట్లాడుతూ.. ‘లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో.. అంత అందంగా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కె.పి.హెచ్.బి ఆంటీలా ఉందని మరి కొంతమంది అంటున్నారు. సో దానిపై మీ రెస్పాన్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను. ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అడగమన్నందుకు అడుగుతున్నా. నాకైతే లైలా చాలా బాగా నచ్చింది.
నాకు కనుక గర్ల్ ఫ్రెండ్ ఉంటే లైలా అనే పేరే పెట్టుకుంటాను. అంత అందంగా ఉంది. కానీ కొంతమందికి కె.పి.హెచ్.బి లా అనిపిస్తుంది. దానికి మీరేమంటారు?’ అంటూ విశ్వక్ సేన్ ను ప్రశ్నించాడు. అందుకు విశ్వక్ సేన్.. “ఎంత అన్యాయం రా ఇది.! ఇంటర్నేషనల్ ఫిగర్ ని తీసుకొచ్చి కె.పి.హెచ్.బి దగ్గర పెడతావా నువ్వు. ఇంటర్నేషనల్ ఫిగర్ అది” అంటూ జవాబిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆ రిపోర్టర్ ను తిట్టిపోస్తున్నారు.
KPHB Aunty?
What a disgusting question to ask at a public movie event! This is not the first time he has asked something like this. pic.twitter.com/gGgrta0vjT