విశ్వక్ సేన్ చేయమనవసరం లేని పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా దర్శకుడిగా నిర్మాతగా కూడా మారిన సంగతి మనకు తెలిసిందే ఈయన సొంత నిర్మాణంలో తానే దర్శకుడిగా దస్ కా దమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో ఈయన దర్శకుడిగా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో అందరికీ విశ్వక్ సేన్ గా తెలిసిన ఈయన అసలు పేరు దినేష్ అని చాలా మందికి తెలియదు. అయితే చదువులు మొత్తం కూడా ఇదే పేరుతో పూర్తి చేసినటువంటి ఈయన అనంతరం సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీ వైపు వచ్చారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు అవకాశాలు రాకపోవడంతో తన తండ్రి స్వయంగా తనకు విశ్వక్ సేన్ అని పేరు మార్చారని ఈయన ఒక సందర్భంలో తెలియజేశారు.
ఇక తన చదువు మొత్తం హైదరాబాద్లోనే పూర్తి అయ్యిందని (Vishwak Sen) విశ్వక్ సేన్ వెల్లడించారు. తాను 9వ తరగతి చదువుతున్న సమయంలోనే సినిమా ఎడిటింగ్ నేర్చుకున్నానని తెలిపారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను అంటే తన తండ్రి ఒప్పుకోరని ఈయన ముందు చదువుపై దృష్టి పెట్టారు. దీంతో జర్నలిజంలో డిగ్రీ కోర్స్ జాయిన్ అయ్యారు. అయితే ఈ డిగ్రీలో ఏకంగా తొమ్మిది బ్యాక్లాగ్స్ ఉండిపోవడంతో చదువుపై ఆయనకు కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయిందట.
ఇలా ఏకంగా తొమ్మిది సబ్జెక్టులు ఉండడంతో తనకు చదువు సరిపోదని భావించి డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే విశ్వక్ సేన్ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అనంతరం ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలను అందుకున్నారని తెలుస్తోంది. ఇలా తన చదువు గురించి విశ్వక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.