మొన్నీమధ్య వరకు ఇతర సినిమాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమాను ఇప్పుడు టీమే వాయిదా వేసింది. దీంతో సుమారు ఐదు సినిమాలు ఇబ్బందికర పరిస్థితికి ఎదుర్కొంటున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? సినిమా డేట్‌ను అమాంతం రెండు వారాలు వాయిదా వేసేశారు. దీంతో ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్‌లోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఎందుకు డేట్ మార్చారు అని కొందరు అంటుంటే.. ఆ సినిమాల డేట్స్ ఏంటి? అని మరికొందరు అంటున్నారు.
గతేడాది డిసెంబర్ తొలి వారం నుండి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వవస్తోంది. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం లేటెస్ట్ రిలీజ్ డేట్ మే 17. ఈ మేరకు ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు. అయితే హఠాత్తుగా ఇప్పుడు డేట్ మార్చేసింది టీమ్. మే 31న సినిమాను రిలీజ్ చేస్తాం అని లేటెస్ట్‌గా అనౌన్స్ చేసింది. దీంతో ఆ డేట్‌కి వద్దాం అనుకున్న అయిదు సినిమాలు కాకపోయినా.. కొన్ని డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాయి.
సుధీర్ బాబు (Sudheer Babu) ‘హరోంహర’ (Harom Hara), కార్తికేయ (Kartikeya) ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) , ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ‘గంగం గణేశా’ (Gam Gam Ganesha) , కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ‘సత్యభామ’ (Kajal’s Satyabhama) , అజయ్ ఘోష్ (Ajay Ghosh) – చాందిని చౌదరి (Chandini Chowdary) ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy) మే 31 తేదీకి రావాలని ముందుగానే ప్రచారం షురూ చేశాయి. మరి వీరిలో ఎవరు వాయిదా వేసుకుంటారో చూడాలి. అయితే మే 17 ఖాళీ అయింది కాబట్టి ప్రీపోన్ చేసుకునేవాళ్లూ ఉన్నారు అని అంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.
ఇన్నాళ్లూ ఇతర సినిమాల వాయిదాల వల్ల ఆలస్యమై… ఒకానొక సమయంలో ‘ఇప్పుడు కానీ వాయిదా పడితే నేను ఇక ప్రచారంలో కనిపించను’ అని విశ్వక్‌సేన్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సినిమా వాయిదా పడటంతో మిగిలిన సినిమాల తేదీలను మార్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఈసారి వాయిదా ఐపీఎల్ వల్లనేమో అని అంటున్నారు.