‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌లా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచి, అలరించింది యువ కథానాయిక రితాకా నాయక్ (Ritika Nayak). దిల్లీకి చెందిన ఈ భామ ఆ సినిమాలో నటిస్తోంది, నటించింది అనే విషయం కూడా తెలియదు. సినిమాలో ఆమె యాక్టివ్‌నెస్, లుక్స్ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. లైవ్లీ లుక్స్ ఉండటంతో నెక్స్ట్ బిగ్ స్టార్ ఆమెనే అని అనుకున్నారు కొందరు. అయితే ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఛాన్స్‌లొస్తున్నాయి.
అలా ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవును రితికా ఇప్పుడు నాలుగు ప్రాజెక్టుల్లో భాగమైంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తున్న రితికా నుండి కొత్త సినిమా ఇటీవల స్టార్ట్ అయింది. ఇప్పుడు నాలుగో సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. చూస్తుంటే ఇటు సీనియర్ హీరోలు, అటు జూనియర్ హీరో అంటూ అందరితో సినిమాలు చేసేస్తోంది. చూస్తుంటే అప్పుడెప్పుడో అనుకున్న స్టార్ హోదా రాబోయే రోజుల్లో ఆమెకు వచ్చేలా ఉంది.
కొత్తగా ఓకే అయింది అని చెబుతున్న సినిమా నుండి మనం స్టార్ట్ చేద్దాం. గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా ‘ఘాజీ’(Ghazi) సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు అని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా కథానాయిక ఎవరు అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. గోపీచంద్ – రితిక మీద ఇటీవల ఫొటో షూట్ చేశారట. అంతా ఓకే కూడా అనుకున్నారని, త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తారని భోగట్టా.
ఇక మొన్నీమధ్యే మొదలైన వరుణ్ తేజ్ (Varun Tej) సినిమా ‘కొరియన్ కనకరాజు’లో కూడా రితికనే నాయిక. ఇక ఇప్పటికే ఆమె తేజ సజ్జా (Teja Sajja) – మంచు మనోజ్ (Manchu Manoj) సినిమా ‘మిరాయ్’లో (Mirai) నటిస్తోంది. అలాగే ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) సినిమా ‘డ్యూయెట్’లో కూడా మెను కాస్ట్ చేశారు. అలా నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయన్నమాట.