‘అంటే సుందరానికి’ టీజర్ వచ్చింది. ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ వచ్చింది. మొదటి సినిమా ట్రైలర్ వచ్చింది. రెండో సినిమా ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కనిపించిన ఫుటేజ్‌ను పట్టుకొని కొంతమంది ఆ రెండు సినిమాల కథ ఒక్కటే అంటూ పుకార్లు రేపుతున్నారు. తాజాగా ఆ పుకార్ల గురించి ‘అంటే సుందరానికి’ దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే… ‘‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా సినిమాటోగ్రాఫర్ శ్రీరామ్ ఓసారి వివేక్ ఆత్రేయకు ఫోన్ చేశారట.
తమ సినిమా కోసం వివేక్ సాగర్‌ను మ్యూజిక్ డైరక్టర్‌గా తీసుకునే అంశంపై మాట్లాడారట. అలా మాటల సందర్భంలో సినిమా స్టోరీ ఏంటని అడిగారట శ్రీరామ్ వాకబు చేశారట. క్రిస్టియన్ అమ్మాయి – హిందూ అబ్బాయి మధ్య జరిగే ప్రయాణమే సినిమా కాన్సెప్ట్ చెప్పారట వివేక్ ఆత్రేయ. అప్పుడు నాది కూడా దాదాపు అదే స్టోరీ అన్నారట ఆత్రేయ.‘అంటే సుందరానికి’ కథను అప్పటికే నానికి నెరేషన్ ఇచ్చారట వివేక్ ఆత్రేయ. దాని గురించి అప్పుడు అనేక మీడియాలో ఆర్టికల్స్ వచ్చేశాయట.
క్రిష్ణ వ్రింద విహారి దర్శకుడు అనీష్.. వివేక్ ఆత్రేయకు మంచి ఫ్రెండ్ అట. దీంతో సినిమా కథ విషయమై అతడితో మాట్లాడారట వివేక్ ఆత్రేయ. హీరో హిందూ బ్రాహ్మిణ్ అనే విషయం చెప్పారట అనీష్. నా సినిమాలో కూడా నాని బ్రాహ్మణుడు అని చెప్పారట వివేక్. రెండు కథల్లో అంతవరకు మాత్రమే సిమిలారిటీ ఉందని, మిగతాదంతా సెపరేట్ అని చెప్పారట వివేక్ ఆత్రేయ.
అలా రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వివేక్ ఆత్రేయ. బ్రాహ్మణ సంప్రదాయాలు, క్రిస్టియన్ అమ్మాయితో రిలేషన్ షిప్ లాంటి వ్యవహారాలపై కూడా వివేక్ ఆత్రేయ స్పందించారు. సమాజంలో ఎవర్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయలేదని, కేవలం కథను మాత్రమే ప్రజెంట్ చేశామని వివేక్ ఆత్రేయ అన్నాడు. స్వతహాగా బ్రాహ్మణుడిగా తన కమ్యూనిటీలో ఉండే ఆచార వ్యవహారాలన్నీ తనకు బాగా తెలుసన్నాడు వివేక్ ఆత్రేయ.