టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ తో సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ నటించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలు వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానున్నాయి. పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే తాజాగా ఏపీ సీనియర్ నేతలలో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తక్కువ సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుని యువతలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2019 సంవత్సరంలో పవన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా రెండుచోట్ల ఓటమిపాలు కావాల్సి వచ్చింది.
ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ పవన్ ఊహించని విధంగా వ్యవహరించారని ఎన్నికల్లో ఓటమిపాలైతే ఎవరైనా రాజకీయాలకు దండం పెట్టి వెళ్లిపోతారని పవన్ కళ్యాణ్ మాత్రం వెన్ను చూపలేదని అన్నారు. ఓటమి పాలైన కొన్ని రోజులకే పవన్ ప్రజల్లోకి వచ్చి తాను ఎక్కడా వెనక్కు తగ్గలేదని ప్రజలకు అండగా ఉంటానని చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం సినిమాలు చేసుకుంటానని పవన్ చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ గురించి ఉండవల్లి పాజిటివ్ కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.